‘పట్టణ ప్రగతి’కి సన్నద్ధం

జిల్లాలో ‘పల్లె ప్రగతి’ని విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక పట్టణ ప్రగతికి సన్నద్ధమవుతున్నారు. ఈనెల 24నుంచి పది రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంపై మేయర్‌, మున్సిపల్‌ అధ్యక్షులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులతో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గనిర్దే శం చేశారు. పట్టణ ప్రగతి కార్యాచరణపై వివరిస్తూ ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని ఆదేశించారు. సీఎంతో సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సం క్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, రామగుండం మేయర్‌ బంగి అనిల్‌ కుమార్‌, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్లు చిట్టిరెడ్డి మమతారెడ్డి, పుట్ట శైలజ, ముత్యం సునిత, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ పాల్గొన్నారు.