మాస్కులు ధరించి బయటికి రావాలి

తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వస్తున్న వారు మాస్కులు ధరించాలని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌లోని పోలీస్‌ క్వార్టర్స్‌లో ఉంటున్న కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులకు శుక్రవారం  శానిటైజర్లు, మాస్కులను డీసీపీ అందజేశారు. రామన్నపేట శివారులోని జిల్లా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. లాక్‌డౌన్‌ విధుల్లో పాల్గొంటున్న పోలీసులకు  శానిటైజర్లు, మాస్కులను అందజేశారు.ఆత్మకూరు(ఎం), మోటకొండూర్‌ మండలాల్లో లాక్‌డౌన్‌ను పరిశీలించారు. ఆలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని కోరారు.